Breaking News
Home / National / ఒకే బిల్డింగ్‌లో 44 మందికి కరోనా..

ఒకే బిల్డింగ్‌లో 44 మందికి కరోనా..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా ఆగ్నేయ ఢిల్లీలోని కపాషేరా ప్రాంతంలో ఒకే బిల్డింగ్‌లో ఉంటున్న 44 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ బిల్డింగ్‌లో ఉంటున్న ఒక వ్యక్తికి ఏప్రిల్‌ 18న కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అధికారుల ఆ భవనాన్ని సీజ్‌ చేసి, అందులో ఉంటున్న 175 మంది శాంపిల్స్‌ను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం పంపించారు. శనివారం 67 మంది ఫలితాలు వచ్చాయి. వారిలో 44 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి ఫలితాలు వస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *