Breaking News
Home / National / దేశంలో కరోనా విలయం.. 10 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా విలయం.. 10 లక్షలు దాటిన కేసులు

కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని భారత్‌ ఇప్పుడు విలవిలలాడుతోంది. నానాటికీ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో… దేశంలో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా 10 లక్షలకు చేరుకుంది. భారత్‌లో ఒకే రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 32,695 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,00,202కి చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో మహారాష్ట్ర లో 8641…తమిళనాడు 4549… కర్ణాటక 4169..ఆంధ్రప్రదేశ్ 2593… ఉత్తర ప్రదేశ్ 2058…. పశ్చిమబెంగాల్ 1690… ఢిల్లీ 1652.. పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన కంటే ముందు అమెరికా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఇక దేశంలో మొత్తం మరణాల సంఖ్య గురువారం రాత్రికి 25,553కి చేరుకుంది.

Check Also

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

Share this on WhatsAppడిజ్లీపూర్ (అండమాన్ నికోబార్ దీవులు): అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటలకు భూకంపం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *