Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆపీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖ ఆపీసులో 33 మందికి కరోనా

ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో కలకలం రేపుతోంది. దీంతో కార్యాలయాన్ని మూసివేశారు. గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత గతంలో లేని విధంగా రోజుకు వందకుపైబడి కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 కేసులు నమోదు కావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

గుంటూరు జిల్లా, అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశుసంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. ముందు ఈ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్‌కు పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆఫీసులో ఉండే 120 మంది ఉద్యోగులకు పరీక్షలు చేయగా.. 33 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో కార్యాలయాన్ని మూసివేశారు. మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *