Breaking News
Home / National / మహారాష్ట్రలో 1,666 మంది పోలీసులకు కరోనా…

మహారాష్ట్రలో 1,666 మంది పోలీసులకు కరోనా…

ముంబై: కరోనా మహమ్మారి దెబ్బకు మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. కేసులు, మరణాలతో విలవిల్లాడుతోంది. ఇక, ముంబైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరోవైపు, కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు 1,666 మంది పోలీసులు కరోనా వైరస్ బారినపడగా, 16 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. బాధితుల్లో 473 మంది కోలుకున్నట్టు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 41,642 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 11,726 మంది కోలుకున్నారు. 28,462 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు 1,454 మంది మృతి చెందారు. కరోనా కేసులు, మరణాల జాబితాలో మహారాష్ట్ర దేశంలోనే ముందుంది.

Check Also

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం…

Share this on WhatsAppఅమరావతి: సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *