Breaking News
Home / Lifestyle / Business / నోకియా ప్లాంట్ లో 42 మందికి కరోనా…

నోకియా ప్లాంట్ లో 42 మందికి కరోనా…

చెన్నై : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌ లో కార్యకలాపాలను నిలిపివేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ కర్మాగారంలోని సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారు అనేది నోకియా వెల్లడించలేదు. మరోవైపు కనీసం 42 మందికి కరోనా సోకిందనే వాదన వినిపిస్తోంది.

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఇటీవల ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించామని, భౌతికదూరం, క్యాంటీన్ లో మార్పులు లాంటి నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాజా పరిణామం నేపథ్యంలో పరిమిత సిబ్బందితో త్వరలోనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని చెప్పింది.

 

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *