Breaking News
Home / World / గాలి ప్రసరణ లేని గదులతో కరోనా ముప్పు…

గాలి ప్రసరణ లేని గదులతో కరోనా ముప్పు…

లండన్‌: గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే సూక్ష్మ బిందువుల్లో నుంచి నీరు క్రమంగా ఆవిరైపోతుందని, వైరస్‌ కణాలు మాత్రం ఆ పరిసరాల్లోనే ఉండిపోతాయని పేర్కొన్నారు. అందువల్ల గదులలో గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

Check Also

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మృతి

Share this on WhatsAppవేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *