Breaking News
Home / States / Andhra Pradesh / ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల చాలా మంది రాజకీయ నేతలు, వారి గన్‌మెన్లు కూడా కరోనా బారిన పడుతూ వస్తున్నారు. అయితే తాజాగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు. అయితే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో రోజాకు కూడా కరోనా వచ్చిందేమోనని ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలలో ఆందోళన నెలకొంది. అయితే దీనిపై స్పందించిన రోజా తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, కరోనా బారినపడిన తన గన్‌మెన్ 18 రోజులుగా సెలవుల్లో ఉండి విధులకు రావడం లేదని చెప్పారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *