Breaking News
Home / Film News / బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

బుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా బిగ్ బాస్-3 కంటెస్టెంట్, ప్రముఖ సీరియల్ హీరో రవి కృష్ణ కరోనా భారిన పడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని గత మూడు రోజుల నుండి ఐసోలేషన్ లోనే ఉంటున్నానని వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ దేవుడి దీవెనలతో, ఫ్యాన్స్ అభిమానంతో తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. కరోనా ఎలా వచ్చింది అన్నదానిపై టెంక్షన్ పడట్లేదని పేర్కొనారు. అంతేకాకుండా తనతో కాంటాక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరు ఐసోలేషన్లోనే ఉండాలని సూచించారు. తనను కలిసిన వాళ్ళు ముందుగానే టెస్ట్ చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. వైరస్ భారిన పడ్డవారిపై వివక్ష చూపించకూడదని కోరారు. తాను నెగిటివిటీకి దూరంగా ఉండి త్వరగా కోలుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం రవి కృష్ణ పలు సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు కరోనా పాజిటివ్ రావటంతో అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Check Also

బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్..! ఆందోళనలో టీవీ యాక్టర్స్.!

Share this on WhatsAppతెలంగాణలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *