Breaking News
Home / National / రాజస్థాన్‌లో కరోనా వైరస్ అనుమానిత రోగి…

రాజస్థాన్‌లో కరోనా వైరస్ అనుమానిత రోగి…

రాజస్థాన్: కరోనా వైరస్ అనుమానిత రోగి ఒకరు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ వైద్యకళాశాలలో చేరిన ఘటన కలవరం రేపింది. చైనా దేశంలో ఎంబీబీఎస్ చదివిన ఓ వైద్యవిద్యార్థి తిరిగి భారతదేశానికి రాగా అతనికి కరోనా వైరస్ లక్షణాలున్నాయని, దీంతో అతన్ని జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ వైద్యకళాశాలలోని ఐసోలేషన్ వార్డుకు తరలించామని రాజస్థాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ చెప్పారు. కరోనా వైరస్ అనుమానిత రోగితోపాటు అతని కుటుంబసభ్యుల రక్త శాంపిళ్లను సేకరించి పరీక్షించేందుకు పూణే నగరంలోని జాతీయ వైరాలజీ లాబోరేటరీకి పంపించామని మంత్రి పేర్కొన్నారు. చైనా దేశం నుంచి 18 మంది రాజస్థాన్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు తిరిగి వచ్చారని, వారందరినీ తమ వైద్యాశాఖ అధికారులు, వైద్యులు 28 రోజుల పాటు పరిశీలిస్తున్నారని మంత్రి రఘుశర్మ చెప్పారు. చైనా నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో వైద్యులు పరీక్షలు జరిపించిన తర్వాతే వారి స్వస్థలాలకు పంపించాలని మంత్రి రఘుశర్మ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *