Breaking News
Home / National / సుప్రీంకోర్టును దిగ్భ్రాంతికి గురిచేసె అయోధ్యపై కౌన్సిల్ ఎదురుప్రశ్న

సుప్రీంకోర్టును దిగ్భ్రాంతికి గురిచేసె అయోధ్యపై కౌన్సిల్ ఎదురుప్రశ్న

అత్యంత వివాదాస్పదమైన అయోధ్య రామమందిరం కేసు విచారణలో ముస్లిం పార్టీలు సోమవారంతో తమ వాదనలను ముగించారు. బుధవారంతో ఇరుపక్షాల వాదనలను ముగించాలని సుప్రీంకోర్టు తన గడువును ఒకరోజు ముందుకు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ముస్లిం పార్టీల తరపున వాదించిన కౌన్సిల్ రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించారు.న్యాయస్థానంలో అన్ని ప్రశ్నలను ముస్లిం పార్టీల తరపున వాదిస్తున్న తనపైనే ఎందుకు సంధిస్తున్నారు, ఈ కేసులు భాగమైన ఇతర పార్టీలను ఎందుకు వదిలేస్తున్నారని రాజీవ్ ప్రశ్నించడంతో కోర్టు దిగ్భ్రాంతికి గురైంది. అలాంటి వివక్ష కానీ, పాక్షికత కానీ తనకు లేవని కోర్టు ప్రకటించింది. ముస్లిం పార్టీల తరపున వాదిస్తున్న కౌన్సిల్ రాజీవ్ ధావన్ మాట్లాడుతూ ఈ కేసు విచారణ సందర్భంగా తాను కొన్ని ఆసక్తికరమైన అంశాలను గమనించానని చెప్పారు. మీరు వేస్తున్న అన్ని ప్రశ్నలూ నేరుగా నాకే తగులుతున్నాయి కానీ ప్రతిపక్షులను అంతగా ప్రశ్నిస్తున్నట్లు లేదు. వారిని కూడా గౌరవ న్యాయమూర్తులు కొన్ని అంశాలపై ప్రశ్నించి ఉంటే బాగుండేది అంటూ రాజీవ్ అపెక్స్ కోర్టులో 38వరోజు న్యాయ విచారణ సందర్బంగా చెప్పారు.అయితే కోర్టు ఆయన వ్యాఖ్యలను అంగీకరించలేదు. ముస్లం పార్టీల తరపున వాదిస్తున్న కౌన్సిల్ తన ముందుకు వచ్చిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వాలని కోర్టు పేర్కొంది.

రాజీవ్ వ్యాఖ్యలతో విభేదించిన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ ఇది అవాంఛిత ప్రకటన అని వాదించారు. కానీ ధావన్ దానికి తిరుగు సమాధానమిస్తూ తాను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కానీ అన్ని ప్రశ్నలూ తనపైకే ఎందుకు సంధిస్తున్నారన్నదే సమస్య అన్ని చెప్పారు.రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించి బాబర్‌ చక్రవర్తి చారిత్రక తప్పిదం చేశారని.. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని హిందూ పార్టీ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు నెలకొన్నాయి.దేశ న్యాయచరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన అయోధ్య రామమందిరం కేసుపై నేటితో వాదనలు ముగించి నవంబర్ 17 నాటికి తీర్పు ప్రకటించడానికి సుప్రీం కోర్టు సిద్ధమైన విషయం తెలిసిందే.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *