హైదరాబాద్: గాంధీ సిద్ధాంతాలను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ జాతిపిత అన్న ట్రంప్ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు వక్రీకరించాయని చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య మోదీ శాంతి దూతలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శాంతి ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనవరి 30 కల్లా.. అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.
