Breaking News
Home / States / అన్నవరంలో దంపతులు ఆత్మహత్య..

అన్నవరంలో దంపతులు ఆత్మహత్య..

హైదరాబాద్‌: ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందిన హైదరాబాద్‌కు చెందిన దంపతులు అన్నవరంలో ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పవన్.. హైదరాబాద్‌లో పవన్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న పవన్‌కు వాటి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన పవన్ భార్య ధనలక్ష్మితో కలిసి అన్నవరం చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జీ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *