Breaking News
Home / National / కరోనా అలర్ట్‌: భక్తులెవరూ మా గుడికి రావొద్దు!

కరోనా అలర్ట్‌: భక్తులెవరూ మా గుడికి రావొద్దు!

తిరువనంతపురం: కరోనా భయాల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం బోర్డు భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. నెలవారి పూజా కార్యక్రమాల సందర్భంగా మార్చి నెల ముగిసే వరకు భక్తులు ఆలయానికి రావొద్దని కోరింది. కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ బోర్డు ప్రెసిడెంట్‌ ఎన్‌. వాసు గుర్తు చేశారు. ఇక షెడ్యూల్‌ ప్రకారం అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. అయితే, ఎవరైనా తెలియక స్వామివారి దర్శనార్థం వస్తే.. వారిని ఆపే ప్రయత్నం చేయమని వాసు ‍స్పష్టం చేశారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *