నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు అస్త్రంగా వాడుకొంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై. వెంకటేశ్వర రావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గళం వినిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచారని విమర్శించారు. ప్రత్యేక హోదా చట్టబద్ధంగా సాధించుకోవడం మన హక్కని అన్నారు. అఖిలపక్షాన్ని కలుపుకొని అధికార పార్టీ ఉద్యమ బాట పట్టాలని సూచించారు. ప్రత్యేకహోదా ఉద్యమానికి సీపీఎం ఎప్పుడు ముందుంటుందని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
