Breaking News
Home / States / తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు…

తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు…

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఎన్‌హెచ్‌ఆర్సీని సీపీఐ నేత నారాయణ కలిశారు. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని, ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్మికుల పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌ తీరు వల్ల కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి శవాల మీద కేసీఆర్‌ నడుచుకుంటూపోయారని దుయ్యబట్టారు. శనివారం ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే.. తన గొయ్యి తాను తవ్వుకున్నట్లేనని నారాయణ వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *