Breaking News
Home / Politics / వారు కేసీఆర్ ఇంట్లో పనివాళ్లు కాదు: తమ్మినేని

వారు కేసీఆర్ ఇంట్లో పనివాళ్లు కాదు: తమ్మినేని

హైదరాబాద్: సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్‌లో, కేరళలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారా? అన్న కేసీఆర్ మాటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, వారికి పెన్షన్ సదుపాయంతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు రెండు నెలల ముందు నోటీసిచ్చి సమ్మె ప్రారంభించారని, వారి సమ్మె చట్టబద్ధమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక్క కలంతో 50 వేల మంది ఉద్యోగాలను తొలగించడానికి వారు కేసీఆర్ ఇంట్లో పనివాళ్లుకాదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తొమ్మిదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్నిడిపోల ముందు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని ఆయన ప్రకటించారు. మరోవైపు హుజూర్ నగర్ నామినేషన్ తిరస్కరణకు బాధ్యులైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అక్కడ తెలంగాణ ప్రజాపార్టీకి చెందిన సాంబశివ గౌడ్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *