హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే యోచనలో సీపీఐ పార్టీ ఉన్నట్లు సమాచారం. మంగళవారం ముఖ్దూం భవన్లో సమావేశమైన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ప్రధానంగా హుజూర్నగర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై చర్చ జరిపింది. అనంతరం నారాయణ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజమన్నారు. హుజూర్నగర్లో సీపీఐకి 7 వేల ఓటు బ్యాంక్ ఉందని, కొన్ని కారణాల వల్ల పోటీ చేయలేకపోతున్నామన్నారు. ఇవాళ కార్యవర్గం సమావేశంలో మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు.
