Breaking News
Home / States / Andhra Pradesh / పర్యటన వివరాలు అఖిలపక్షానికి తెలపాలి….

పర్యటన వివరాలు అఖిలపక్షానికి తెలపాలి….

విజయవాడ: నేడు సీపీఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారవుతారని, సీఎం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించాలని చెప్పారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయం నడుస్తోందని, రైతులను కులాల వారీగా విభజించి వారికీ పైసలు రాకుండా తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు విభజన సమస్యలు ఓ దశకు రాలేదని, ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు చెప్పాలని, రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టొందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *