కోల్కతా: సీపీఐ సీనియర్ నేత గురుదాస్ గుప్తా(83) కోల్కతాలో నేడు కన్నుమూశారు. దాస్గుప్తా గుండె, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తన నివాసంలోనే కన్నుమూశారు. దాస్గుప్తా 1936 నవంబర్ 3న బారిసాల్లో జన్మించారు. తన జీవితంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలతో సుదీర్ఘ అనుంబంధం కలిగి ఉన్నారు.
