న్యూఢిల్లీ: హుజూర్నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్కు సీపీఐ మద్దతివ్వాలని ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ కలిసి పోటీ చేశాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉపఎన్నికల్లో మద్దతుపై సీపీఐ జాతీయ నేత డి.రాజాతో మాట్లాడానన్నారు. టీఆర్ఎస్కు సీపీఐ మద్దతిస్తే తమకు పోయేదేమీలేదన్నారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన సీపీఐ.. ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతిచ్చి తప్పు చేయొద్దని ఆయన సూచించారు. ఉపఎన్నికల్లో ఓడిపోతామన్న భయం కేసీఆర్కు పట్టుకుందని వీహెచ్ అన్నారు.
