పశ్చిమ గోదావరి: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు సాయినాథ్ కళ్యాణ్ మండపంలో సీపీఎం పశ్చిమ గోదావరి డెల్టా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ బీజేపీ హయాంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ న్యాయ వ్యవస్థలో వారికి అనుకూలంగా ఉన్న జడ్జిలను నియమించుకోవడం దారుణమైన పరిస్థితి అని పేర్కొన్నారు.
