Breaking News
Home / Politics / సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ…

సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ…

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తున్నారు. మొత్తం 119 నామినేషన్లు దాఖలవ్వగా నిన్నటితో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో సీపీఎం అభ్యర్థి శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు ఎలాంటి ధృవీకరణ అధికారికంగా ప్రకటించలేదు. 2014, 2018లో రెండుసార్లు ఆయన పోటీలో నిలబడ్డారు. ఈసారి అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ నింపకపోవడమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది. దీంతో సీపీఎంలో గందరగోళం నెలకొంది. అధికార టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ పద్మావతి, టీడీపీ తరఫున కిరణ్మయి, బీజేపీ తరఫున రామారావు నామినేషన్లు దాఖలు చేశారు. వారితో పాటు పలువురు సర్పంచ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *