టి. నరసాపురం: మండలంలోని ఎఎస్ఆర్ నగర్ భూ వివాదంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన రెవెన్యూ అధికారులు, సిపిఎం నాయకులు తుమ్మల సత్యనారాయణ, అనుమోలు మురళీలు శనివారం బెయిల్పై విడుదలయ్యారు. టి.నరసాపురంలో వీరిని మండల సిపిఎం ఆధ్వర్యంలోని నాయకులు పూలమాలలు వేసి తీన్మార్ డప్పులతో ఘనంగా ఆహ్వానించారు. అక్రమ అరెస్టులతో భూ పోరాటాలను ఆపలేరని సిపిఎం నాయకులు గుడెల్లి వెంకట్రావు అన్నారు. విడుదలైన నాయకులను తహశీల్దారు కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా తీసుకెళ్ళారు.
