Breaking News
Home / National / బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం….

బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం….

ఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం, కేంద్ర సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి బిడ్లు ఖరారయ్యాయి. ఆర్కిటెక్చర్, డిజైన్ బిడ్లు ఖరారు చేస్తూ సీపీడబ్ల్యూడీ నిర్ణయం తీసుకుంది. 250 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టనుంది. మూడు ఐకానిక్ భవనాల నిర్మాణానికి ఏజెన్సీలు డిజైన్‌లను ఖరారు చేయనున్నాయి. భవనాల డిజైన్ మనదేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయని, 2022 సంవత్సరంలో మూడు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నార్త్ బ్లాక్, సౌత్, ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కదిలించమని, మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.12,450 కోట్లు అని ప్రాథమిక అంచనా వేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *