Breaking News
Home / National / త్వరలో పెళ్లిపీటలెక్కనున్న యువ ఆటగాడు…

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న యువ ఆటగాడు…

ముంబయి: టీమిండియా యువ ఆటగాడు మనీశ్‌పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దక్షిణాది నటి అర్షితా శెట్టిని అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 2న ముంబయిలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని సమాచారం. చాన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నాళ్ల నుంచో విందు, వినోదాలకు చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరుగుతున్నారట. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. ప్రస్తుతం మనీశ్‌ విజయ్‌ హజారే టోర్నీలో కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.

అర్షిత దక్షిణాది నటి. ముంబయికి చెందిన 26 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తుళు భాషలో ‘తెళికెడా బొల్లి’ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. చందమామలాంటి మోము, అందమైన ఆహార్యంతో యువత మది దోచేసింది. ఆ తర్వాత ‘ఉదయం ఎన్‌హెచ్‌4’ ద్వారా తమిళ పరిశ్రమలో పరిచయమైంది. ‘ఒరు కన్నియమ్‌ మూను కలవానికుళుమ్‌’తో మంచి పేరు తెచ్చుకుంది.

‘ఇంద్రజిత్‌’ సినిమాలో అదరగొట్టింది. ప్రస్తుతం ఆర్‌.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో ‘నాన్‌ దా శివ’ చిత్రంలో నటిస్తోందని సమాచారం. మనీశ్‌, అర్షిత వివాహం అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టీ20 సందర్భంగా డిసెంబర్‌ 2న టీమిండియా సభ్యులు ముంబయిలోనే ఉంటారు. వారంతా ఈ పెళ్లికి హాజరుకానున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *