Breaking News
Home / Film News / నెటిజన్ల విమర్శలు…క్లారిటీ ఇచ్చిన శృతి….

నెటిజన్ల విమర్శలు…క్లారిటీ ఇచ్చిన శృతి….

ఫిల్మ్ న్యూస్: తనకు విస్కీ అంటే చాలా ఇష్టమని, దానిని అతిగా తీసుకోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యానని ఇటీవల మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతీహాసన్ వెల్లడించింది. ప్రియుడు మైకేల్ కోర్సలేతో బ్రేకప్ గురించి, సినిమాలకు గ్యాప్ ఇవ్వడం గురించి, ఆల్కహాల్ గురించి ఆ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడింది. అయితే అల్కహాల్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యానని శృతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమెపై విమర్శలు మొదలయ్యాయి.

ఈ విమర్శలు మరింత ఎక్కువవడంతో శృతి తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ‘మద్యం తాగడంలో తప్పేం లేదు. మద్యం సేవించడం నేటి సంస్కృతిలో భాగమైపోయిందనేది నిజం. అలాగని నేనేం మద్యం తాగే వాళ్లకి సపోర్ట్ చేయడం లేదు. కానీ, నేటి సమాజంలో చాలా మందికి ఆ అలవాటు ఉంది. నాకూ గతంలో ఆ అలవాటు ఉండేది. ఆ విషయం చెబితే నేను మద్యానికి బానిసైపోయానని ఎలా అంటారు? నేనిప్పుడు మద్యం తీసుకోవడం లేదు. ప్రశాంతంగా జీవిస్తున్నాను. దయచేసి నా వ్యాఖ్యలను వక్రీకరించకండ’ని శృతి చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *