తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. రేపు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
