Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. అలాగే
టైం స్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కాగా శ్రీవారి ఆలయంలో సోమవారం జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. సాయంత్రం స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనులు ఆలయం నుంచి బయల్దేరి తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ పుట్టమన్నును సేకరించి తిరిగి ఆలయం చేరుకుంటారు. రాత్రికి యాగశాలలో అంకురార్పణ క్రతవు జరిపిస్తారు. ఈ కారణంగా ఆదివారం సాయంత్రం వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దుచేశారు.

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *