Breaking News
Home / States / మొక్కలు నాటిన సీఎస్ జోషి…

మొక్కలు నాటిన సీఎస్ జోషి…

హైదరాబాద్‌: తెలంగాణలో హరితహారం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని, అలాగే ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కె జోషి పిలుపునిచ్చారు. గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మేడిపల్లి అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాకు పోలీస్‌ మౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దామోదర గుప్తా గ్రీన్‌ఛాలెంజ్‌ విసిరారని అన్నారు. ఈ సందర్భంగా మూడు మొక్కలు నాటిన సీఎస్‌ జోషి మరో ముగ్గురికి గ్రీన్‌ఛాలెంజ్‌ విసిరారు. ఇందులో ఏపీ సీఎస్‌ నీలం సహానీ, స్పెషల్‌ సీఎస్‌ రాజేశ్వర్‌ తివారీ, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభ ఉన్నారు. మూడు మొక్కలు ఎందుకు నాటాలి అంటే మనకు సరిపోయే ఆక్సీజన్‌ను మూడు మొక్కలు ఇస్తాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *