Breaking News
Home / States / డెంగ్యూ జ్వరాలపై సీఎస్ సమీక్ష…

డెంగ్యూ జ్వరాలపై సీఎస్ సమీక్ష…

హైదరాబాద్: రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్వరాలు, వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలి. క్రిమికీటకాల నుంచి వచ్చే వ్యాధుల నిరోధానికి కార్యాచరణ రూపొందించాలి. జ్వరాలు వచ్చిన చోట వెంటనే చర్యలు తీసుకోవాలి. జ్వరాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి. దోమల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలి. ఫాగింగ్ సరైన పద్ధతిలో చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *