Breaking News
Home / States / లాటరీ పేరుతో భారీగా దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు….

లాటరీ పేరుతో భారీగా దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు….

నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన గంగారెడ్డి నగరంలోని ఓ కళాశాలలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తూ కాచీగూడలో నివాసం ఉంటున్నాడు. ఒక రోజు గంగారెడ్డికి కోకో కోలా కంపెనీ లాటరీలో రూ.3కోట్ల నగదు వచ్చిందంటూ మెయిల్‌ వచ్చింది. దీంతో గంగారెడ్డి తన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంపించాడు.

ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత డాక్టర్‌ నికోలస్‌ పేరుతో గంగారెడ్డికి ఫోన్‌ వచ్చింది. రూ.23వేలు జమ చేస్తే రూ.3కోట్ల చెక్కు పంపిస్తామని ఆగంతకుడు చెప్పగానే గంగారెడ్డి వెనకా ముందూ ఆలోచించకుండా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు పంపాడు. ఇలా 5నెలలుగా సుమారు రూ.43.22లక్షలను గంగారెడ్డి పంపించాడు. తన తండ్రిని నమ్మించి 4 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి మరీ డబ్బు పంపించాడు. తండ్రికి అనుమానం వచ్చి కంపెనీ వారికి ఫోన్‌ చేయమని చెప్పడంతో గంగారెడ్డి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌ అని వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *