హైదరాబాద్: ఎస్వీబీసీ బోర్డు డైరెక్టరు పదవిపై నటుడు శ్రీనివాస రెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆ పదవి దక్కింది తనకు కాదని.. ‘ఢమరుకం’ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అని ట్వీట్ చేశారు.
నటుడు శ్రీనివాస రెడ్డి, యాంకర్ స్వప్నలను వైసీపీ సర్కారు ఎస్వీబీసీ డైరెక్టర్లుగా నియమించిందంటూ ప్రచారం జరిగింది. కొన్ని పత్రికలలో కూడా దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. దీంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నటుడు శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ ఆ పదవి వచ్చింది తనకు కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాకపోవడంతో అందరిలో గందరగోళం నెలకొంది.