దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, ఇంద్రవెల్లి మండలం నిజాంగూడ, అసిఫాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడీ బృందాల ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ పూజలతో పాటు రేలా రేలా అంటూ నృత్యాలు చేశారు.
