హైదరాబాద్: నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ ఆటలతో పాటు దాండియా ఆటలను కూడా దుర్గాదేవికి ముచ్చటగొలిపే అభిషేకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహిళలు బతుకమ్మ కొత్త చీరలతో పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. దసరా పండుగ చీరల కోసం షాపింగ్ చేస్తున్న మగవలకు కొరత లేదు. దసరా ఉత్సవాల్లో ప్రధానంగా కనిపించేవి బతుకమ్మ ఆటలు, దాండియా ఆటలు. జంటనగరాలు, పెద్దపెద్ద పట్టణాల్లో సైతం గుజరాతీయులు స్థిరపడటంతో వారి సాంస్కృతిక నృత్యాలు, ఆటపాటలు, కేళీవిలాసాలు తెలంగాణ, ఆంధ్రులకు కూడా అలవాటయ్యాయి.
