Breaking News
Home / Film News / దర్బార్ మూవీ రివ్యూ…

దర్బార్ మూవీ రివ్యూ…

మూవీ : దర్బార్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి..
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: అనిరుధ్
ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్

సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. దర్బార్ ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ అంచనాలతో విడుదలైంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కథ:
ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ఒక వింత పోలీస్ ఆఫీసర్. ఎవరైనా తప్పు చేస్తే చంపడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతుంటాడు. అసలు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య ఇలా ఒక మ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా మారడం వెనుక కారణమెవరు? ఆదిత్య ఎవరికోసం వెతుకుతాడు. ముంబై కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి డ్రగ్ మాఫియాను అంతం చేయాలనుకున్న ఆదిత్య అరుణాచలంకు ఎదురైన సవాళ్లేంటి? కోల్పోయినదేంటి? ఈ ప్రశ్నలకు జవాబులు సినిమాలోనే దొరుకుతాయి.

నటీనటులు:
రజినీకాంత్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పేదేముంది. ఎన్నో సినిమాలుగా మనల్ని అలరిస్తూ వస్తోన్న రజినీకాంత్ మరోసారి దుమ్ముదులిపే పెర్ఫార్మన్స్ తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రజినీ స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ నే కాక సామాన్య ప్రేక్షకులను కూడా కట్టి పడేస్తాయి. మ్యాడ్ కాప్ గా రజినీకాంత్ నటన చాలా బాగుంది. ఇక డ్యాన్సుల్లో, ఫైట్స్ లో కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. చూడటానికి కూడా రజినీ చాలా యంగ్ గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఇదే రజినీ బెస్ట్ లుక్. నయనతార చూడటానికి బాగుంది. అయితే ఆమెకు పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కలేదు. నివేద థామస్ కు చాలా మంచి పాత్ర పడింది. రజినీ తర్వాత గుర్తుండిపోయే పాత్ర ఈమెదే. స్వతహాగా మంచి నటి అవ్వడం వల్ల ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. విలన్ గా సునీల్ శెట్టి మెప్పించాడు. ప్రతీక్ బబ్బర్ కూడా పర్వాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కనపడుతుంది. ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. మూవీ యూనిట్ ఏది అడిగితె అది కాదనకుండా నిర్మాతలు డబ్బు ఖర్చుపెట్టినట్టున్నారు. అనిరుద్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మెప్పించాడు. ముఖ్యంగా ఎలివేషన్ కోసం వాడుకున్న ర్యాప్ భలేగా వర్కౌట్ అయింది. కథ చాలా సినిమాల్లో చూసిన సాధారణ రివెంజ్ డ్రామానే. అయితే మురుగదాస్ దీనికి తనదైన శైలి కథనాన్నిజోడించాడు. కొన్ని సీన్స్ లో మురుగదాస్ ప్రతిభ కనపడుతుంది. ముఖ్యంగా అజయ్ మల్హోత్రాను బయటకు రాబట్టే సన్నివేశం మురుగదాస్ చమక్కుల్లో ఒకటి. ఇలాంటివి మరిన్ని పడి ఉంటే బాగుండేది.

విశ్లేషణ:
రజినీకాంత్ సినిమా అనగానే అందరూ తన మార్క్ మ్యానరిజమ్స్ పై దృష్టి పెట్టి అసలు కథను విస్మరిస్తున్నారు. దర్బార్ విషయంలో కూడా దాదాపుగా ఇలాంటి ప్రమాదమే జరిగింది. చాలా సాధారణ కథను చెప్పే ప్రయత్నం చేసాడు మురుగదాస్. తన సినిమాల్లో ఎప్పుడూ చెప్పే ఏదొక కొత్త పాయింట్ ను ఇందులో పూర్తిగా వదిలేసాడు. డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ తో పెద్ద సమస్యనే ఎత్తుకున్నా.. తర్వాత దాన్ని వదిలేసి పర్సనల్ రివెంజ్ వైపు వెళ్ళిపోయాడు. అయితే అవకాశం ఉన్న చోటల్లా రజినీ మార్క్ ఎలివేషన్స్ ను సరైన స్థాయిలో వాడుకోవడంతో దర్బార్ గ్రాఫ్ పడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పూర్తి రేసిగా ఉండగా, సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పే చోట నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పెద్దగా మెప్పించవు. అయితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో సినిమాను పైకి లేపి ముగించాడు మురుగదాస్.

చివరిగా: ఫ్యాన్స్ కు పండగే, మిగిలిన వారికి రోటీనే.

రేటింగ్: 3/5

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *