టీనగర్: లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి నటిస్తున్న చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. డ్రీమ్ వారియర్ ఫిక్చర్స్ బ్యానరుపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ష్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం దీపావళి పండుగ రోజు విడుదల కానున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. రెండు రోజుల ముందుగా అంటే 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ చిత్రంలో కథానాయిక లేరని, నరేన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని సమాచారం.
