తూర్పు గోదావరి : కొత్తపల్లి సిఐటియు నాయకుడు చీకట్ల సాంబశివరావు పెద్దకుమార్తె ఆశాజ్యోతి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. ఆశాజ్యోతి పిఠాపురంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. గత రెండు రోజులుగా తన పెద్దకుమార్తె ఆశాజ్యోతి ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని, జ్వరంతో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 6 గంటలకు కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ లో ఆశాజ్యోతి మృతి చెందిందని తండ్రి సాంబశివరావు తెలిపారు. ఆశాజ్యోతి మృతికి సంతాపంగా పిఠాపురం ప్రైవేట్ కళాశాలలు సెలవు ప్రకటించాయి.
