Breaking News
Home / National / 5 నెలలు సెలవు పెట్టిన సీఎం కుమార్తె…?

5 నెలలు సెలవు పెట్టిన సీఎం కుమార్తె…?

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత తన తండ్రి కోసం ఉద్యోగానికి ఐదు నెలలు సెలవు పెట్టి తండ్రి వెంట ఉంటున్నారు. ఈ విషయాన్ని కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. హర్షిత తన తండ్రి కేజ్రీవాల్ మాదిరిగానే చదువులో ఎంతో ప్రతిభ చూపారు. 12 వ తరగతిలో 96 శాతం మార్కులను సంపాదించి తరువాత ఇంజినీరింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఐఐటీ జేఈఈలో మంచి ర్యాంకు దక్కించుకున్న అనంతరం 2014లో ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం పొందారు. ఈ ఏడాదే కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు నెలల పాటు సెలవు పెట్టి అసెంబ్లీలో తిరుగుతూ అందరినీ పలుకరిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *