Breaking News
Home / States / గాంధీ ఆసుపత్రికి దిశ నిందితుల మృతదేహాలు…

గాంధీ ఆసుపత్రికి దిశ నిందితుల మృతదేహాలు…

హైదరాబాద్ : పోలీస్ బందోబస్తు మధ్య దిశ హత్యాచార కేసు నిందితుల మృత దేహాలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్యకళాశాల నుంచి సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మహబూబ్‌నగర్‌ నుంచి ఏసీ వాహనాల్లో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

అంతేకాకుండా శుక్రవారం వరకు మృతదేహాలను భద్రపరచాలని సూచించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం..ఇదే కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. దిశ ఎన్ కౌంటర్ విచారణలో సీనియర్ అడ్వకేట్ ప్రకాష్ రెడ్డిని మధ్యవర్తిగా నియమించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *