చిత్తూరు : సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో తెలుగు గంగలో కాలుజారిపడి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించి వెలికితీశారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాళెం సరిహద్దులో ఉన్న పర్యాటక కేంద్రానికి కొందరు స్నేహితులు వెళ్లారు. వారిలో మనోజ్ అనే యువకుడు పర్యాటక కేంద్రానికి సమీపంగా ఉన్న తెలుగు గంగ కాలువ వద్ద సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి తెలుగు గంగలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. తెలుగు గంగ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. గాలింపు కష్టతరంగా మారింది. ఈరోజు ఉదయం వరదయ్య పాళెం మండలం ఎంజినగర్ సమీపంలోని తెలుగు గంగ కాలువ వద్ద మనోజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికితీశారు.
