Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / డిపార్టుమెంట్‌ పరీక్షలకు గడువు 21

డిపార్టుమెంట్‌ పరీక్షలకు గడువు 21

విజయవాడ: జూన్‌ 13 నుంచి 18వరకు జరగనున్న వివిధ రకాల డిపార్టుమెంట్‌ పరీక్షలకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె. లెనిన్‌ బాబు, ఎస్‌పి మనోహర్‌ కుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్‌లను ప్రభుత్వం ముందుంచారు. జీవో నెం. 602ను అనుసరించి భాషాపరమైన, సర్వే సంబంధిత పరీక్షలకు మినహా మిగిలిన అన్ని పరీక్షలు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణతో పాటు మైనస్‌ మార్కుల విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నందున ఈ రెండు విధానాలను తీసివేయాలన్నారు. 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంట్‌ పరీక్షలలో మినహాయింపును పునరుద్ధరించాలన్నారు.

Check Also

అధికార పార్టీ నేత ” నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.” : మాజీ స్పీకర్

Share this on WhatsAppసత్తెనపల్లి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే తన కుటుంబసభ్యులపై కేసులు బనాయిస్తున్నారని మాజీ స్పీకర్‌ డాక్టర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *