Breaking News
Home / National / సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం…

సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం…

ఖార్తూమ్‌ : సూడాన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. దేశ రాజధాని ఖార్తూమ్‌లోని ఓ కర్మాగారంలో ఎల్‌పీజీ ట్యాంకర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కర్మాగారంలో 50 మంది వరకు భారతీయులు పనిచేస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో అగ్ని ప్రమాదాల్ని నివారించేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. .

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *