Breaking News
Home / States / వేర్వేరు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం…

వేర్వేరు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం…

జనగామ/వరంగల్ : జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం బంజార వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు సహా నలుగురు మృతి చెందారు. అంబులెన్స్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *