Breaking News
Home / National / గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

అహ్మదాబాద్: గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు బోల్తా పడిన ఘటనలో దాదాపు 21 మంది దుర్మరణం పాలయ్యారు.  అంబాజీ పట్టణ సమీపంలో త్రిశూల్‌ ఘాట్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈఘటనలో దాదాపు 21 మంది మరణించగా, 50 మంది గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. త్రిశూల్‌ ఘాట్‌ వద్ద అధిక వర్షాలు కురవడం కారణంగానే బస్సు అదుపుతప్పి ఉండవచ్చని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *