రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బైక్ను వేగంగా దూసుకొచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పైనున్న ఓ వ్యక్తి తల నుజ్జునుజ్జయి, దుర్మరణం చెందగా.. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
