Breaking News
Home / National / తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం….

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం….

చెన్నై: దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న వారి కుటుంబాల్లో అంధకారం కమ్ముకుంది. మరణం వారిని విషాదంలో నింపింది. పండుగ సరుకుల కోసం వెళ్లిన ఆరుగురు దుర్మరణం పాలైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీపావళి సరుకులు కొనేందుకు 13 మంది ఆటోలో ఉసిలంబట్టికి బయలుదేరారు. 13 మంది ప్రయాణికులతో ఉన్న ఆటోను లారీ ఢీకొంది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘోరరోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో దుఃఖంలో మునిగిపోయాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *