Breaking News
Home / National / యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం…

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం…

ఉత్తర్‌ప్రదేశ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.  రోడ్డుపక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవీ ఆలయం నుంచి వస్తున్న ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా బులంద్‌షహర్‌లోని నరౌరా ఘాట్‌లో గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వచ్చినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సులోనూ యాత్రికులే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *