Breaking News
Home / States / వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

వరంగల్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి గంగాదేవిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. చనిపోయిన యువకులు గంగాదేవిపల్లికి చెందిన ఇట్ల జగదీష్‌(19), న్యాల నవీన్‌(20), జనగామ జిల్లా నర్మెట్ట మాన్‌సింగ్‌ తండాకు చెందిన లకావత్‌ గణేష్‌(21)గా గుర్తించారు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై వరంగల్‌ నుంచి గంగాదేవిపల్లికి వెళ్తుండగా.. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *