Breaking News
Home / States / ప్రముఖ దళిత ఉద్యమకారుడు మృతి….

ప్రముఖ దళిత ఉద్యమకారుడు మృతి….

హైదరాబాద్: ప్రముఖ దళిత ఉద్యమకారుడు కస్కుర్తి రామలింగం (49) మృతి చెందారు. ఈ నెల 9న రైలు ఎక్కుతూ రామలింగం జారిపడ్డారు. గాయపడిన ఆయన నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. వామపక్ష, కుల విముక్తి ఉద్యమాల్లో రామలింగం క్రియాశీలంగా పనిచేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు దగ్గర అనంతవరంలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రామలింగం మృతిపై దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మృతి దళిత ఉద్యమాలకు తీరని లోటని నేతలు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *