Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / శాసనమండలిలో పింఛన్లపై చర్చ….

శాసనమండలిలో పింఛన్లపై చర్చ….

అమరావతి: శాసనమండలిలో పింఛన్లపై వాడీవేడీ చర్చ జరిగింది. పింఛన్‌ను రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచుతామని.. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి గుర్తు చేశారు. దీనికి సమాధానంగా బొత్స, కన్నబాబు మాట్లాడుతూ.. రూ.2 వేల నుంచి ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో పెంచుతామని.. జగన్‌ చెప్పారని సమాధానమిచ్చారు. జగన్‌ ఆ విషయం ఎక్కడా చెప్పలేదని సంధ్యారాణి తిరిగి పేర్కొన్నారు. పింఛన్లను రూ.200 నుంచి వెయ్యికి, వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచిన ఘనత టీడీపీదేనన్నారు. ఎన్నికల ముందు 2 నెలల్లో రూ.200 నుంచి 2వేలకు పెంచారని మంత్రి అవంతి అడ్డుతగిలారు.

Check Also

ధర్నా చౌక్‌కు చేరుకున్న చంద్రబాబు…

Share this on WhatsAppవిజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఇసుక దీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *